ICC T20 World Cup 2021: Harbhajan Singh and Ajit Agarkar And Former Cricketers Says India's Poor Batting Has Pushed Virat Kohli And Team Out.
#T20WorldCup2021
#TeamIndiaSchedule2022
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#BabarAzam
#ICCTrophy
#RohitSharma
#ViratKohli
టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు చెత్త ఆటతో సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. అయితే టీమిండియా పరాజాయలకు ప్రధాన కారణం టాస్ ఓడిపోవడమేనని బౌలింగ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడం టీమ్ పతనాన్ని శాసించిందన్నాడు. రాత్రి మ్యాచ్‌లు కావడంతో మంచు ప్రభావం ఎక్కువగా ఉండి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్‌గా మారిందని తెలిపాడు. అయితే ఈ వాదనను భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అజిత్ అగార్కర్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టారు. భారత పరాజయాలకు టాస్ ఏ మాత్రం కారణం కాదని, చెత్త బ్యాటింగే కోహ్లీసేన కొంప ముంచిందని చెప్పారు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి టైటిల్ గెలవలేదా? అని ప్రశ్నించాడు.