The Board of Control for Cricket in India (BCCI) has sought more time from the International Cricket Council (ICC) to take an "appropriate call" on hosting the T20 World Cup 2021.
#IPL2021
#T20WorldCup
#ICC
#BCCI
#IPL2021Phase2inUAE
#EmiratesCricketBoard
#India
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ కూడా డైలమాలో పడింది.టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కసరత్తు ఆరంభించింది. దీనికోసం సోమవారం దుబాయ్‌లో భేటీ కానుంది. ఐసీసీ బోర్డు సభ్యులు ఇందులో పాల్గొంటారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరవ్ గంగూలి, కార్యదర్శి జయ్ షా సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీనికోసం వారంతా దుబాయ్ బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం ముగిసిన బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఐసీసీ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.