ICC WTC Final 2021 Day 2 Live Score, Updates: The much-awaited World Test Championship final finally resumed as the Sun came out on Saturday
#WTCFinalDay3
#SouthamptonWeatherForecast
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ ఇక మరింత రసవత్తరంగా మారనుంది. వర్షం దెబ్బకు తొలిరోజు మొత్తం తుడిచి పెట్టుకుపోయిన ఈ మ్యాచ్.. క్రమంగా ఫలితం తేలే దిశగా అడుగులు వేస్తోంది. వెలుతురు లేమి వల్ల రెండోరోజు ఆట పూర్తిగా కొనసాగకపోయినప్పటికీ. అవే తరహా వాతావరణం ఒక సౌథాంప్టన్‌లో ఉండకపోవచ్చు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్, న్యూజిలాండ్ సమవుజ్జీలుగా నిలిచాయి. ప్రత్యర్థికి మూడు వికెట్లను కోల్పోయినప్పటికీ- వాతావరణం అనుకూలిస్తోండటం వల్ల టీమిండియా భారీ స్కోరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.అన్నీ బాగానే ఉన్నప్పటికీ.. వర్షం పడొచ్చనే బెంగ ఫ్యాన్స్‌ను పట్టి పీడిస్తోంది. గ్రౌండ్‌లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వని పరిస్థితుల మధ్య తొలి రోజు మ్యాచ్ రద్దు కావడం, రెండో రోజు దట్టమైన మేఘాలు కమ్ముకోవడం, ఫలితంగా వెలుతురు లేమితో మ్యాచ్‌ను అర్ధాంతరంగా ముగించేయడం వంటి పరిణామాలు అభిమానుల ఆందోళనకు కారణమౌతోన్నాయి.