India tour of Australia : If Rohit Sharma Fit, Can be Included in The Team - BCCI| Ind vs Aus 2020

Oneindia Telugu 2020-11-02

Views 20.9K

Reacting to Rohit Sharma’s omission from the Indian squad for their tour of Australia, Indian head coach Ravi Shastri said that the call taken by the selection committee upon receiving updates from the medical team.

#IndiatourofAustralia
#RohitSharmaabsence
#IPL2020
#IndvsAus2020
#RaviShastri
#MI
#RohitSharmaFitness
#BCCI
#MumbaiIndians

ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనకు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ ప్యానెల్ ఒక్క ఫార్మాట్‌‌కు కూడా ఎంపిక చేయని విషయం తెలిసిందే. రోహిత్ వేటుపై తీవ్ర దుమారం రేగింది. గాయం కారణంగా రోహిత్‌ను ఎంపిక చేయలేదని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాలే కారణమని భావిస్తున్నారు.ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్‌ శర్మను ఎంపిక చేసే వ్యవహారంలో తాను తలదూర్చలేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. సెలక్షన్ కమిటీ వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నాడు. అన్ని వ్యవహారాలు సెలక్షన్ కమిటీ చూసుకుంటున్నాడు. రోహిత్ మరోసారి గాయపడే ప్రమాదం ఉందని మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన విషయం మాత్రమే తనకు తెలుసని శాస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే సెలక్షన్ కమిటీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని రవిశాస్త్రి చెపుతున్నా.. ఫాన్స్ మాత్రం అతనిపై మండిపడుతూనే ఉన్నారు. కోచ్ అయిన నువ్.. ఆటగాళ్ల ఎంపిక విషయం తెలియదని చెపుతున్నావా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS