కరోనా వైరస్ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా కొత్త డోర్-టు-డోర్ సర్వీస్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టులో వినియోగదారు షోరూమ్ కి రాకుండా తమ ఇంటి వద్ద నుంచే వెహికల్స్ సర్వీస్ చేయించుకునే విధంగా కంపెనీ అవకాశం కల్పించింది.
హోండా యొక్క వెహికల్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం- ద్వారా సర్వీస్ ఈజీగా చేసుకోవచ్చు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కార్లు చాలా కాలంగా ఉపయోగించకుండా నిలిచిపోయాయి. ఈ కారణంగా వాహనాలు ఉపయోగించే ముందు సర్వీస్ చాలా అవసరం.