Gautam Gambhir Is not Eligible To Contest For President’s Post Says DDCA

Oneindia Telugu 2020-01-01

Views 41

The strife-torn Delhi and District Cricket Associations (DDCA) on Monday sought time till the state assembly polls in February to conduct election for the post of its president.
#GautamGambhir
#souravganguly
#DDCA
#viratkohli
#rohitsharma
#msdhoni
#RajatSharma
#teamindia
#cricket

ఢిల్లీ & డిస్ట్రిక్‌ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే గంభీర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డీడీసీఏ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారా తెలిపారు. డీడీసీఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.
ఇటీవల జరిగిన డీడీసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక వర్గం సభ్యులు ఓ ప్రతిపదనను తీసుకురాగా దాన్ని మరోవర్గం వారు వ్యతిరేకించారు. దీంతో డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్‌ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీడీసీఏను రద్దు చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని ట్విట్టర్ వేదికగా కోరాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెంటనే చర్యలు తీసుకొని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అనంతరం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌ను గాడిన పెట్టేందుకు అధ్యక్షుడిగా బాధ్యతలను గంభీర్‌కు ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీడీసీఏ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారా మాట్లాడుతూ "జనవరి ఆఖరిలో డీడీసీఏ ఎన్నికలు జరగాలి. కానీ ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత నిర్వహించాలని అంబుడ్స్‌మన్ దీపక్‌ వర్మ కోరారు" అని అన్నారు.
"అయితే, గంభీర్‌ డీడీసీఏకి సేవలు చేయాలని భావిస్తే అతడికి స్వాగతం పలుకుతాం. కానీ అధ్యక్షుడిగా అతడు బాధ్యతలు నిర్వహించాలంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. సర్వసభ్య వార్షిక సమావేశంలో ఘర్షణకు దిగిన వారిపై వారంలోపు కఠిన చర్యలు తీసుకుంటాం" అని వినోద్‌ తిహారా చెప్పుకొచ్చారు.
మరోవైపు జనవరి 13లోపు డీడీసీఏకు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పదవికి గంభీరే అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు

Share This Video


Download

  
Report form