Pro Kabaddi League 2019:A hard-fought match between Telugu Titans and U.P. Yoddha ended in a 20-20 tie.
#prokabaddileague2019
#prokabaddi2019
#DabangDelhi
#UPYoddha
#DabangDelhi
#upyodha
#telugutitans
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న తెలుగు టైటాన్స్ మరోసారి గెలుపు ముంగిట బోల్తా పడింది. శుక్రవారం తెలుగు టైటాన్స్, యూపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య 20-20 పాయింట్లతో డ్రాగా ముగిసింది.
ఆఖరి 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇరు జట్ల స్కోరు 19-19తో సమంగా ఉన్నాయి. ఈ దశలో తెలుగు రైడర్స్ సిద్ధార్ధ్ కూతకు వెళ్లాడు. ఆ సమయంలో యూపీ ఆటగాడు సుమిత్ కోర్టు బయటకు వెళ్లడంతో 20-19తో టైటన్స్ గెలుపు ఖాయమైంది. దీంతో టైటాన్స్ విజయం సాధించిందని సంబురపడే లోపే.. అంపైర్లు ఊహించని షాకిచ్చారు.