ICC Cricket World Cup 2019,India vs New Zealand:In the first semi-final of the ICC Cricket World Cup 2019, table-toppers India play New Zealand in what promises to be a highly entertaining game at Old Trafford. The league game between the two teams was washed out without giving each other a chance to go head to head.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#henrynicholls
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
న్యూజిలాండ్‌తో మాంచెస్టర్ వేదికగా ఈరోజు జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (1: 14 బంతుల్లో)ని పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ (28: 51 బంతుల్లో 2x4) బుట్టలో వేశాడు. జడేజా విసిరిన బంతిని డిఫెన్స్ చేసేందుకు నికోలస్ ప్రయత్నించగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి బ్యాట్, ఫ్యాడ్స్ మధ్య నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ని గీరాటేసింది. బంతి వెళ్లిన తీరుతో తొలుత షాక్‌కి గురైన నికోలస్.. ఆ తర్వాత నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అంతకముందు ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని పాయింట్ దిశగా కట్ చేసేందుకు గప్తిల్ ప్రయత్నించగా.. బ్యాడ్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. అక్కడే ఉన్న కోహ్లీ ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా క్యాచ్ అందుకున్నాడు.