IPL 2019: Chennai Super Kings Defeats Kolkata Knight Riders By 7 Wickets | Match Highlights

Oneindia Telugu 2019-04-10

Views 130

Chennai Super Kings (CSK) won on Kolkata Knight Riders (KKR) by 7 wickets at the MA Chidambaram Stadium in Chennai. Chasing 109 runs, CSK were given a good start by Shane Watson, who scored 17 off just 9 ball. His innings included 2 fours and 1 six. Suresh Raina then departed after scoring 14 off 13 ball (1 four, 1 six).
#IPL2019
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#msdhoni
#andrerussell
#dineshkarthik
#SureshRaina
#SunilNarine
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించింన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
తాజా విజయంలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై బ్యాట్స్‌‌మెన్లలో ఓపెనర్‌ డుప్లెసిస్‌ 45 బంతుల్లో43(3 ఫోర్లు) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు అంబటి రాయుడు (21) ఫర్వాలేదనిపించాడు. షేన్‌ వాట్సన్‌ (17), సురేశ్‌ రైనా (14) త్వరగా ఔటయ్యారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోల్‌కతా ఓపెనర్లలో క్రిస్ లిన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ సునీల్‌ నరైన్‌(6) కూడా నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే క్రిస్ లిన్‌ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో సునీల్ నరైన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణాను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.

Share This Video


Download

  
Report form