IPL 2019 : Delhi Capitals Beat Kolkata Knight Riders In Super Over || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-01

Views 80

Delhi Capitals beat Kolkata Knight Riders on Saturday as Kagiso Rabada defended 10 runs in the Super Over. With this win, Delhi are now up to the second spot in the table with four points.In the super over, Delhi score 10 runs and Rabada executed yorkers perfectly to restrict KKR to 7/1 and deny a win.
#ipl2019
#dcvskkr
#superover
#delhicapitals
#kolkataknightriders
#sreyasayyar
#dineshkarthik
#rishabpant
#ferozshahkotla

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు విజయాలతో మంచి జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ని 'సూపర్ ఓవర్‌'‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత ఆండ్రీ రసెల్ (62), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50) హాఫ్ సెంచరీలు సాధించడంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఆ తర్వాత ఛేదనలో పృథ్వీ షా (99: 55 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సులు) ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ కూడా 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 185 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు వికెట్ నష్టానికి 10 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్‌కతా 7/1కే పరిమితమైంది.

Share This Video


Download

  
Report form