IPL 2018 : Kolkata Knight Riders Crush Delhi Daredevils By 71 Runs

Oneindia Telugu 2018-04-17

Views 55

Defending a huge total of 200, KKR bowled exceptionally well and bundled DD to a paltry 129 in 14.2 overs and registered a comprehensive win. Sunil Narine (3/18) and Kuldeep Yadav (3/32) were the pick of bowlers for KKR and heroes with the ball in an emphatic win which has propelled them to the second spot in the points table.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో 3000కిపైగా పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును చేరిన 12వ ఆటగాడిగా దినేశ్‌ కార్తీక్‌ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ ఏడు పరుగుల వద్ద ఉండగా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తన కెరీర్‌లో 156వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న కార్తీక్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని దాటాడు.
ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు ధోనీ పేరిట ఉండేది. ధోని 131 మ్యాచ్‌ల్లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రాబిన్ ఉతప్ప (121 మ్యాచ్‌లు) ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (118 మ్యాచ్‌లు), ఏబీ డివిలియర్స్ (115 మ్యాచ్‌లు) నిలిచారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా.. సురైశ్ రైనా రెండోస్థానంలో ఉన్నాడు.
ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ఈడెన్‌ గార్డెన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్‌ పంత్‌(43; 26 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(47; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.
ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్‌ చావ్లా, రస్సెల్‌, శివం మావి, టామ్‌ కుర్రాన్‌లు తలో వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS