India opener Shikhar Dhawan, who has joined the rest of the Delhi Capitals squad after the ODI series against Australia, on Monday said he was looking to help younger players get used to the pressure of playing in the Indian Premier League (IPL).
#IPL2019
#DelhiCapitals
#ShikharDhawan
#mumbbaiindians
#MSDhoni
#CSKVsRCB
#ChennaiSuperKings
#viratkohli
#RCB
#cricket
#teamindia
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఆడిన ధావన్.. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం సమయంలో తన ధర విషయంలో ఫ్రాంఛైజీతో విభేదించడం.. ఆ తర్వాత ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు బదిలీ చేసిన సన్‌రైజర్స్ అతడి స్థానంలో విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఆ జట్టు నుంచి తీసుకుంది. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ "ఐపీఎల్‌లో ఇప్పటవరకు సమతూకంగా ఉన్న జట్టే విజేతగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంచి సమతూకంగా ఉంది. జట్టులో నైపుణ్యమున్న ఆల్‌రౌండర్లు, స్పిన్నర్స్, బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ముఖ్యంగా టాప్-4 బ్యాట్స్‌మెన్ (శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్) జాతీయ జట్టుకు ఆడుతున్నారు. వీరంతా కాస్త దూకుడుగా ఆడితే, ఢిల్లీ జట్టు కచ్చితంగా ఈ ఏడాది టైటిల్‌ను గెలుచుకుంటుంది" అని ధావన్ అన్నాడు. టోర్నీలో భాగంగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.