IPL 2018: Shikhar Dhawan Created A History In IPL

Oneindia Telugu 2018-05-26

Views 71

Shikar Dhawan Has Got Into The LIst Of Players Who Scored 4000 runs Im ipl Match

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగువేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ చేరాడు.
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు శిఖర్ ధావన్ 142 మ్యాచ్‌లాడి 4019 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ 8వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 4953 పరుగులతో సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ(4948) రెండో స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(4493), గౌతమ్ గంభీర్(4217), రాబిన్ ఉతప్ప(4084)లు ఉన్నారు. కాగా, ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోర్ 95 కాగా మొత్తం 32 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు.
ఓపెనర్లు ధావన్, సాహాలు తొలి వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సాఫీగా సాగిపోతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్‌ని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (34), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఔట్ చేసి హైదరాబాద్‌ని ఒత్తిడిలోకి నెట్టాడు.

Share This Video


Download

  
Report form