After the Pulwama tragedy, Indian fans have urged Virat Kohli and Co to not play Pakistan in the forthcoming 2019 ICC World Cup in England.
#ViratKohli
#WorldCup2019
#teamindiasqardinworldcup
#ICCWorldCup
#Pulwamatragedy
#MSDhoni
#rohithsharma
#cricket
#Teamindia
ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విజ్ఞప్తి చేసింది. గత గురువారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 40కి పైగా జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఈ దాడిని ఖండిస్తూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను పంపడంతో పాటు వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా తమ వంతు సాయం చేస్తున్నారు.
ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల ప్రసారాన్ని కూడా బ్రాడ్‌కాస్టింగ్ అధికారులు నిలిపివేశారు. తాజాగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వరల్డ్‌కప్‌లో పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ముందస్తు షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ జట్ల మధ్య జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా మాట్లాడుతూ "దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్ కనీసం స‍్పందించాల్సి ఉంది" అని అన్నారు.