AP Elections 2019:Jana Sena chief Pawan Kalyan to announce 25 Lok Sabha constituency leaders on 20th January. Jana Sena will submit Parliamentary party committees list to Pawan Kalyan.
#APElection2019
#PawanKalyan
#LokSabha25LokSabhaConstituencyLeaders
#ConstituencyLeaders
#janasena
#andhrapradeshelections2019
జనసేన పార్లమెంటరీ కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. నేతలు, కేడర్‌కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 25 పార్లమెంటరీ స్థాయి పార్టీ కమిటీలలో స్థానిక నేతలకు స్థానం కల్పిస్తూ తుది జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రేపు తుది జాబితాను పరిశీలించనున్నారు. ఈ నెల 20వ తేదీన జనసేనాని కమిటీలను ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు జనసేన ఓ ట్వీట్ చేసింది. పార్టీ కమిటీల ఎంపిక దాదాపు పూర్తయిందని, ఈ నెల మూడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు విజయవాడలో జరిగిన జిల్లాల సమీక్ష సమావేశాల్లో కమిటీల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, జాబితాలకు సీనియర్ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నారని, మా నాయకులు, కేడర్‌కు వేర్వేరుగా కమిటీలను నియమించాలని పవన్ ఆదేశించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రానికి తుది జాబితాను జనసేనానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. పరిశీలన తర్వాత నియామకాలను ప్రకటిస్తారన్నారు.