India vs Australia: Prime Minister Narendra Modi and President Ram Nath Kovind for winning India's first ever Test series win in Australia.
#IndiavsAustralia
#viratkohli
#teamindiarevengedance
#KuldeepYadav
#pmmoditweet
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin
ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవాలన్న దశాబ్దాల కల నెరవేరడంతో క్రికెట్, సినీ, రాజకీయ ప్రముఖులు కోహ్లీసేనపై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన ట్విట్టర్‌లో టీమిండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "ఆస్ట్రేలియాలో ఓ చారిత్రక క్రికెట్ విజయమిది. ఈ అద్భుతమైన విజయానికి టీమిండియా సభ్యులు అన్ని విధాలుగా అర్హులు. సిరీస్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతోపాటు టీమ్ వర్క్ కనిపించింది" అని మోడీ ట్వీట్ చేశారు.