India vs Australia 2018, 2nd Test : Hanuma Vihari Replace injured Rohit Sharma, R Ashwin | Oneindia

Oneindia Telugu 2018-12-14

Views 104

With India going for a four seamers attack in Ishant Sharma, Umesh, Jasprit Bumrah and Mohammed Shami, it is the second time this year that India are going without a spinner in a Test.
#viratkohli
#IndiavsAustralia
#rohithsharma
#UmeshYadav
#HanumaVihari
#Telugucricketer
#PerthTest
#2ndTest
#ashwin


టీమిండియాలోకి తెలుగు క్రికెటర్ హనుమ విహారి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్..హనుమ విహారి.. ఆ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో పాటు మూడు కీలక వికెట్లూ పడగొట్టాడు. కానీ.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అతనికి అవకాశం దక్కలేదు. అయితే.. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్-ఎ టీమ్ తరఫున మెరుగ్గా రాణించిన హనుమ విహారి.. పెర్త్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌తో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. అడిలైడ్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయపడటంతో.. హనుమ విహారికి ఈ ఛాన్స్ దక్కింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS