Mustafizur Rahman Barred From Playing Overseas T20 Leagues For Two Years

Oneindia Telugu 2018-07-21

Views 60

బంగ్లాదేశ్‌ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఐపీఎల్‌తో పాటు విదేశాల్లో జరిగే ఇతర టీ20 లీగ్‌లకు రెండేళ్ల పాటు దూరం కానున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ స్పష్టం చేశారు. విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతున్న ముస్తాఫిజుర్ తరుచూ గాయాల పాలవుతున్నాడు.
దీంతో అతడు బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ మాట్లాడుతూ "కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉండొద్దని ముస్తాఫిజుర్‌కు చెప్పాను" అని అన్నారు.

Bangladesh fast bowler Mustafizur Rahman is unlikely to participate in overseas T20 leagues during the next two years. In order to preserve the injury-prone seamer for national duty, the Bangladesh Cricket Board (BCB) have already denied permission for him to play in franchise-based T20 tournaments across the globe.
#mustafizurrahman
#t20
#bangladesh
#bangladeshcricketboard

Share This Video


Download

  
Report form