Lakshmi Manchu’s film W/o Ram directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points. The recently released trailer received wide applause from many, including director ace S.S. Raja mouli himself. In fact, the film managed an official entry into the Ottawa Film Festival, where it has been termed a socially conscious thriller.
అనగనగా ఓ ధీరుడు, ఊ కొడుతారా ఉలిక్కిపడుతారా? గుండెల్లో గోదారి లాంటి విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మీ దగ్గరవుతూనే ఉన్నారు. ఆమె నటించిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలకు నోచుకొన్నా, కమర్షియల్‌గా మంచి హిట్ సాధించలేకపోయాయి. అయినా తనదైన మార్కుతో టాలీవుడ్‌లో ఆమె దూసుకెళ్తున్నారు. తాజాగా నూతన దర్శకుడు విజయ్ ఏలకంటి దర్శకత్వంలో వైఫ్ ఆఫ్ రామ్ అనే సస్పెన్స్, థ్రిల్లర్‌తో ముందుకొచ్చారు. ఈ చిత్రం మంచు లక్ష్మికి కమర్షియల్‌గా మంచి పేరు తెస్తుందా? విమర్శకుల ప్రశంసలకు చేరువయ్యేలా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
దీక్ష(మంచు లక్ష్మీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేసే ఉద్యోగి. ఊహించని పరిస్థితుల్లో తన భర్త (సామ్రాట్) ప్రమాదవశాత్తూ మరణిస్తాడు. తన భర్త మరణానికి కారణం ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసుల సహకారం కోరుతుంది. కానీ తాను ఆశించినట్టు వారి నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. ఈ క్రమంలో రాకీ (ఆదర్శ్) కారణం అని తెలుస్తుంది.