Lakshmi Manchu’s upcoming film directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points.The film has completed the censor formalities and was awarded a UA certificate by the board that was all praise for the film. It is now set to release on July 20.
#WifeOfRam
#VijayYelakanti
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ రామ్'.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. జులై 20న సినిమా విడుదవుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి మీడియాతో ముచ్చటించారు.
తెలుగులో చాలా అరుదుగా జోనర్ బేస్డ్ సినిమాలు వస్తుంటాయి. సాధారణంగా మనం యాక్షన్, మ్యూజిక్, డ్రామా అన్ని ఒకే సినిమాలో పాకించేద్దామనుకుంటాం. కానీ కాలం మారింది. వైఫ్ ఆఫ్ రామ్ అనేది సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అని మంచు లక్ష్మి తెలిపారు.
విజయ్ నాకు స్టోరీ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. టిపికల్ తెలుగు సినిమా కాదు. పాటలు డాన్సులు అస్సలు ఉండవు. మామూలుగా మన సినిమాల్లొ హీరోను ఇంట్రడ్యూస్ చేయడం, హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేయడం లాంటి తరహాలో కాకుండా నేరుగా కథలోకి ప్రేక్షకులు వెళతారు అని మంచు లక్మి తెలిపారు.