Nandamuri Kalyan Ram and Kajal Aggarwal starrer Telugu movie MLA (Manchi Lakshanalunna Abbai) directed by Director Upendra Madhav's, has received positive reviews and ratings from the audience
కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎంఎల్ఏ'( మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. యూఎస్ఏ లాంటి ఓవర్సీస్ లొకేషన్లలో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. చాలా వరకు సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
సినిమా ఫస్టాఫ్ ఓకే. హే ఇందు అనే పాట చాలా బావుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్సలెంటుగా ఉంది... అంటూ ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఫస్టాఫ్ రొటీన్ గా ఉంది. కొత్తగా ఏమీ అనిపించలేదు. కొన్ని కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయి. శతకోటి కమర్షియల్ సినిమాల్లో బోడి కమర్షియల్ మూవీ ‘ఎంఎల్ఏ' అంటూ మరో సినీ అభిమాని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎంఎల్ఏ ఫస్టాఫ్ ఓకే. ఇంటర్వెల్ ద్వారా స్టోరీ రివీలైంది. ఓకే ఏదో అలా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్ఠపడేవారు ఒకసారి చూడొచ్చు.... అంటూ మరో సినీ ప్రేక్షకులు వెల్లడించారు.
ఎంఎల్ఏ మూవీలో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. కళ్యాణ్ రామ్ అన్న బాగా చేశాడు. డైరెక్షన్ కాస్త వీక్ గా ఉంది. రెండు మూడు చోట్ల మ్యూజిక్ డౌన్ అయింది. ఓవరాల్ గా ఎక్సలెంట్ మూవీ అని మరో అభిమాని తెలిపారు.
ఎంఎల్ఏ సినిమా విశేషాల్లోకి వెళితే.... ఒక సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ వ్యాల్యూస్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెనర్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో పలు పెద్ద సినిమాలకు రచయితగా పని చేసిన ఉపేందర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టెన్మెంట్ బేనర్లో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.