What a World cup this has been! Late goals, VAR controversies, major upsets, heart-stopping penalty shootouts and a lot more. Fasten your seatbelts because you are just going for another ride as the tournament steps into the quarterfinals.
#france
#uruguay
#worldcup2018
#football
#russiaworldcup
రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో బలమైన ఎటాకింగ్‌ను కలిగి ఉన్న ఫ్రాన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ తన ప్రయాణాన్ని నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తమ్మీద ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాయి.