Luis Suarez booked Uruguay's place in the World Cup knockout rounds, marking his 100th international appearance with the only goal in a 1-0 victory over Saudi Arabia. Uruguay's result also means hosts Russia, who have won their opening two Group A matches, are through to the next phase with one fixture to spare, while Egypt and Saudi Arabia are both out of the tournament.
#Fifaworldcup2018
ఫిఫా ప్రపంచకప్‌లో ఉరుగ్వే జోరు కొనసాగిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా రుస్తోవ్ ఎరినా మైదానంలో బుధవారం గ్రూపు-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 1-0 తేడాతో ఉరుగ్వే జట్టు సౌదీ అరేబియాపై విజయం సాధించింది. ఈ క్రమంలో రెండో రౌండ్ దిశగా అడుగులు వేసింది. మ్యాచ్ ఆరంభమే పోటాపోటీగా మొదలైంది.
ఈ క్రమంలో 23వ నిమిషంలో ఉరుగ్వే కీలక ఆటగాడు సురెజ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాతి నుంచి బంతిపై నియంత్రణకోసం సౌదీ అరేబియా తీవ్రంగా పోరాడింది. పలుమార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మ్యాచ్ ప్రథమార్థంలోనే 24వ నిమిషంలో ఉరుగ్వే గోల్ చేసింది.
ద్వితియార్థంలో సైతం ఉరుగ్వే .. సౌదీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికి సౌదీ అరేబియా డెడ్‌లాక్‌ను ఛేదించేందుకు గోల్ పోస్ట్‌పై ఎటాకింగ్‌కు తీవ్రంగా ప్రయత్నించినా గోల్ సాధించలేకపోయింది. దీంతో ఉరుగ్వే 1-0తో గెలిచింది.