In this edition of the FIFA World Cup, 32 countries have made the cut to the final stages and all of them have been pooled into eight groups of four each. The top two from each group qualify for the knockouts (Round of 16) until one winner emerges at the Luzhniki Stadium in Moscow on July 15. Germany won the World Cup 2014 that was hosted by Brazil and will be hopeful of retaining their title and they do have the squad capable of doing that with Joachim Leow still in charge of the world champions.
#fifaworldcup2018
రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో సాకర్ సంరంభం మొదలుకానుంది. ఇందుకు మాస్కో నగరం అందంగా ముస్తాబు అయింది. గురువారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో సాకర్ సంరంభం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్-ఎలో బరిలో నిలిచింది. జూన్ 28వ వరకు గ్రూప్ దశ పోటీలు ఉంటాయి.
ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు... మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు మాస్కోలోని లుజ్నినికి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎప్పట్లాగే ఈ సారి కూడా కొందరు స్టార్ ఆటగాళ్లపై అభిమానుల దృష్టి నిలిచింది. వారిలో ముందు వరుసలో కనిపించేది మెస్సీ, రొనాల్డో, నేమార్. వీరితో పాటు హ్యారీ కేన్ (ఇంగ్లండ్), మహమ్మద్ సలా (ఈజిప్ట్), ఆంటోనీ గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్), కెవిన్ డి బ్రూన్ (బెల్జియం) తమ ఆటతో కనువిందు చేయనున్నారు.