Senegal proved to be Africa's saving grace at the World Cup on Tuesday. Take away their win over Poland and it is five defeats in five for the continent's representatives in Russia. After Nigeria and Algeria both reached the knockout phase four years ago, following Ghana's run to the quarter-finals in 2010, it is already looking like 2018 will be a step backwards for Africa on the biggest stage.
సంచనాలు సృష్టించి పునర్వైభవాన్ని తెర మీదకు తేవాలనే ప్రయత్నంలో.. ఈ సారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన సెనెగల్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. గ్రూపు-హెచ్‌లో పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో ప్రపంచకప్‌లో బోణీ కొట్టంది. గ్రూపు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్ మ్యాచ్ ఆరంభం నుంచే ఎటాకింగ్ ఆటను ప్రారంభించింది.
సెనెగల్ ఢిపెన్స్ ఛేదిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో మ్యాచ్ 37వ నిమిషంలో పోలెండ్ ఆటగాడు కోనెక్ ఓన్‌గోల్‌తో సెనెగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. బంతి ఎక్కువ సేపు పోలెండ్ నియంత్రణలో ఉన్నా.. ఓన్‌గోల్ కారణంతో పోలెండ్‌కు నిరాశ తప్పలేదు. ఇక అనంతరం ఆరంభమైన ద్వితీయార్ధంలోనూ హోరాహోరీగా మ్యాచ్ ఆరంభమైంది. బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు హోరాహోరీగా పోరాడాయి.
ఈ క్రమంలో 60వ నిమిషంలో సెనెగల్ ఫార్వర్డ్‌ర్ నియాంగ్ నేరుగా గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. కాగా మ్యాచ్ సమయం ముగుస్తున్న తరుణంలో పోలెండ్ మిడ్‌ఫీల్డర్ క్రైచోయాక్ 86వ నిమిషయంలో గోల్ చేసి పోలెండ్‌కు తొలి గోల్ అందించాడు. దీంతో స్కోరు 2-1గా మారింది. కానీ ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో సెనెగల్ 2-1తో మ్యాచ్ గెలిచినట్లయింది.