MS Dhoni Gets Comparision With Jos Buttler

Oneindia Telugu 2018-06-25

Views 395

Like rest of the world, the ongoing FIFA World Cup 2018 fever also gripped veteran India cricketer Yuvraj Singh. The left-handed batsman from Punjab said that he's been an ardent Brazil fan and the five-time World Champions have been his 'Doosri Country' during the global extravaganza.

టీమిండియా దిగ్గజ క్రికెటర్.. ధనాదన్ ధోనీతో పోల్చి చెప్పడమే కాకుండా బట్లరే గొప్ప క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్. ప్రస్తుత క్రికెట్‌లో వయస్సుతో సంబంధం లేకుండా దూసుకుపోతోన్న క్రికెటర్ ధోనీ.. అటు ఐపీఎల్‌లో, ఇటు వన్డేల్లో ఆయనకు తిరుగులేదు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ వహించిన ధోనీ అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ట్రోఫీ గెలుచుకునేలా చేశాడు. ఈ క్రమంలో ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని కొందరంటుంటే, అతను ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నాడంటూ ప్రశంసలు కురిపించారు.
అలాంటిది.. వన్డే, టీ20ల్లో ధోనీ కంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అత్యుత్తమంగా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదో వన్డేలో అజేయంగా సెంచరీ బాదేసిన జోస్ బట్లర్ 122 బంతుల్లో (110) 12 ఫోర్లు, 1 సిక్సుతో నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ని గెలిపించాడు.
206 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 29.4 ఓవర్లు ముగిసే సమయానికి 114/8తో ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ.. ఈ దశలో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్.. ఆదిల్ రషీద్ (20: 47 బంతుల్లో)తో కలిసి 8వ వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌కి ఓటమి తప్పించాడు. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లాండ్ 5-0తో క్వీన్‌స్వీప్ చేయగలిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS