MS Dhoni Retirement:MS Dhoni Extend His Career Virat Kohli Request

Oneindia Telugu 2019-07-23

Views 515

At a time when speculations around MS Dhoni's retirement are rife, it has been reported that Indian captain Virat Kohli has requested his predecessor to stay till T20 World Cup 2020.
#MSDhoni
#ViratKohli
#T20WorldCup2020
#rohitsharma
#rishabpanth
#cricket

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భార‌త క్రికెట్‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ విషయంలో రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ఆలోచన లేదని, భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లోకూడా తాను భాగం కానని, మేనేజ్‌మెంట్‌ వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని ఎమ్మెస్కే ప్రసాద్‌కు ధోని స్పష్టం చేసినట్లు సోమవారం వార్తలు షికారు చేశాయి. అయితే రిటైర్మెంట్‌ విషయంలో ధోని వెనుకడుగు వేయడానికి కారణం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినేనని తాజా సమాచారాన్ని బట్టి తెలస్తోంది. వాస్తవానికి ప్రపంచకప్‌ అనంతరమే ధోని ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించాడని, కానీ కోహ్లి విన్నపం మేరకు ఆగాడని భారత కెప్టెన్‌ సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS