72 year old superwoman typist from madhya pradesh who went viral
#superwoman
క్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్ ట్విట్టర్‌లో వీడియోనుషేర్ చేశాడు. ఈమె బామ్మ కాదు.. సూపర్ ఉమన్ అని పొగిడాడు. దేశంలో ఎంతోమంది యువత ఈమెను చూసి నేర్చుకోవాలన్నాడు. చేసే పని ఏదీ తక్కువది కాదు పనికి, నేర్చుకోవడానికి వయసు అడ్డురాదని ట్వీట్ చేశాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 72 ఏళ్ల బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసులో పెద్దదే కాని.. పనిలో మాత్రం యమా స్పీడుతో దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్ సెహోర్‌లో ఉంటున్న లక్ష్మీబాయి.. జిల్లా కలెక్టరేట్ ముందు టైపిస్ట్‌గా పనిచేస్తోంది. డాక్యుమెంట్లు తీసుకుని.. అందుకు సంబంధించిన వివరాలు కనుక్కుని ఆ బామ్మ ఇంగ్లిష్‌లో టైపింగ్ చేయడం చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే. 72 ఏళ్ల వయసులోనూ ఆమె చేతుల్లో వణుకు, పనిలో బెరుకులేకుండా తనపని తాను చేసుకుపోతుంది.