Virender Sehwag Triple Century

Oneindia Telugu 2018-03-29

Views 151

Sehwag is still the only Indian to have a triple century in his name, having done so against Pakistan (309 in Multan) and South Africa (319 in Chennai).

పద్నాలుగేళ్ల అనంతరం సైతం ఐసీసీ వీరేంద్ర సెహ్వాగ్‌ను విడిచిపెట్టలేదు. అప్పట్లో సెహ్వాగ్ రికార్డు అనే స్థాయిలో ట్వీట్ చేసింది. భారత ఆటగాళ్ల ఖ్యాతిని పెంచి, క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన సెహ్వాగ్‌కు ఇవాళ చాలా స్పెషల్‌ డే. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో భారత్‌ తరపున తొలి ట్రిపుల్‌ సాధించిన ఆటగాడు వీరూనే. సరిగ్గా ఆ అరుదైన రికార్డుకు నేటితో సరిగ్గా 14 ఏళ్లు నిండుతున్నాయి.
2004వ సంవత్సరంలో పాకిస్థాన్‌ టూర్‌ సందర్భంగా ముల్తాన్‌ టెస్ట్‌‌లో సెహ్వాగ్‌ ఈ ఘనతను కైవసం చేసుకున్నారు. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న వీరూ.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించారు.
ఇక మొత్తం స్కోరులో.. 39 ఫోర్‌లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్‌ అక్తర్‌, సక్లైన్‌ ముస్తాక్‌, సమీ, రజాక్‌ వేసిన బంతులను చితకబాదుతూ మైదానంలో వీరూ విశ్వరూపం ప్రదర్శించారు.
ఇక అరుదైన ఈ రికార్డును ఐసీసీ గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో 319 పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. చివరిసారిగా భారత్‌ తరపున యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 2016లో నాయర్‌ ఇంగ్లాండ్‌పై చెన్నైలో జరిగిన టెస్టులో 303 పరుగులు సాధించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS