Feroz Shah Kotla gets Virender Sehwag Gate | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-01

Views 136

The Delhi District Cricket Association inaugurated the Virender Sehwag Gate at the Feroz Shah Kotla on Tuesday. Speaking to the press at the event, Sehwag said it was a huge honour for him to have a gate named after him at the Kotla - the ground where he started his journey to become a great.
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని ఓ గేట్‌కు సెహ్వాగ్ పేరు పెట్టారు. బుధవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ గేట్‌ని సెహ్వాగ్ చేత ప్రారంభోత్సవం చేయించింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీడీసీఏ సెహ్వాగ్ గేట్‌ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గేట్ దగ్గర సెహ్వాగ్ సాధించిన రికార్డులను, విజయాలను పొందుపరిచింది.
అయితే ఇక్కడ చిన్న తప్పిదం చోటుచేసుకుంది. టెస్టు క్రికెట్‌లో భారత్ తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెట్ సెహ్వాగ్ అంటూ రాసుకొచ్చింది. గతేడాది కరుణ్ నాయర్ చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయాన్ని డీడీసీఏ మరచిపోయినట్లుంది. అయితే ఈ తప్పిదానికి ఎవరు కారణం అన్నది మాత్రం తెలియరాలేదు.

Share This Video


Download

  
Report form