Sukumar Responds On Rangasthalam Copy Controversy

Filmibeat Telugu 2018-05-29

Views 84

Sukumar Responds on Rangasthalam Copy controversy. Sukumar gave his clarification that he got the idea after watching 'Dharma Yuddham' movie.
#rangasthalam
#sukumar
#ramcharan
#tollywood

రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా తాను రాసుకున్నదే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌కు ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ నేతృత్వంలోని సంఘం..... సుకుమార్ వివరణతో ఏకీభవిస్తూ అధికారిక ప్రెస్ నోట్ జారీ చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఫిర్యాదుదారు, సినీ రచయిత యం. గాంధీకి సూచించింది.
రంగస్థలం' స్టోరీ తన ‘ఉక్కుపాదం', ‘రివేంజ్' కథల ఆధారంగా తయారు చేసిందే అని, ఈ విషయంలో తనకు తగిన న్యాయం చేయాలని సినీ రచయిత యం. గాంధీ కొన్ని రోజుల క్రితం తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌ను ఆశ్రయించారు.
‘రంగస్థలం' చిత్రంలో హీరో తన శత్రువును చంపే విధానం తన కథ నుండి కాపీ కొట్టిందే అని, చావు బ్రతుకుల్లో ఉన్న శత్రువును తొలుత రక్షించి.... అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత తాను ఎందుకు చంపుతున్నానో అతడికి అర్థమయ్యేలా చెప్పి చంపే విధానం తన ‘ఉక్కుపాదం', ‘రివేంజ్' కథల నుండి తీసుకున్నదే అని రచయిత యం. గాంధీ ఆరోపించారు.
గాంధీ చేసిన ఆరోపణలపై సుకుమార్ ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. తాను ‘రంగస్థలం' కథ రాసుకోవడానికి తనను ఇన్స్‌స్పైర్ చేసిన నవలలు, సినిమాలను ఉదహరిస్తూ సుకుమార్ వివరణ ఇచ్చారు. ‘ధర్మయుద్ధం' అనే సినిమా చూసినప్పటి నుంచి తనకు ఈ ఆలోచన ఉన్నట్లుగా సుకుమార్ కమిటీకి తెలిపారు.
విలన్‌ను రక్షించి ఆ తర్వాత చంపే పాయింట్ గతంలో చాలా సినిమాల్లో, పుస్తకాల్లో, నవలల్లో వచ్చిందని... ఈ పాయింటు మీద యం.గాంధీకి హక్కు ఉండదని కమిటీ తేల్చి చెప్పింది. గాంధీ రాసిన కథలో కిడ్నీ దానం చేసి, శత్రువును బ్రతికించి ఆ తర్వాత చంపినట్లుగా ఉంది. ‘రంగస్థలం'లో యాక్సిడెంటుకు గురై కోమాలోకి వెళ్లిన శత్రువుకి 2 సంవత్సరాలు సేవలు చేసి అతడు ఆరోగ్యవంతుడు అయిన తర్వాత చంపినట్లు ఉంది అని కమిటీ పేర్కొంది.

Share This Video


Download

  
Report form