Sukumar Reveals About Ram Charan's Mishap During Rangasthalam Movie

Filmibeat Telugu 2018-04-12

Views 961

Sukumar reveals about Ram Charan's mishap during Rangasthalam movie. Sukumar only aware of that incident

రంగస్థలం చిత్రం విడుదలై రెండవ వారం గడుస్తున్నా ఆ ఫీవర్ ఇంకా అభిమానులని వీడడం లేదు. మగధీర తరువాత రాంచరణ్ కు నిఖార్సైన చిత్రం పడడంతో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సంబరాల వెనుక రంగస్థలం చిత్ర యూనిట్ ఏడాది సమయం కష్టం ఉంది. అదమైన కథని రూపొందించుకున్న సుకుమార్ కష్టపడి వెండి తెరపై రంగస్థలం అనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో అద్భుత విజయంగా నిలిచింది. పల్లె టూరి నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అందరి మనసులని బాగా హత్తుకుంది. ఇప్పటికి రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబడుతుండడం విశేషం. రాంచరణ్ నటనకు అంతా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రంగస్థలం చిత్ర షూటింగ్ సమయంలో రాంచరణ్ కు పెను ప్రమాదం తప్పిందని రివీల్ చేశారు. ఈ విషయం కనీసం రాంచరణ్ కు కూడా తెలియదని ఆ సమయలో చాలా కంగారు పడ్డానని సుక్కు తెలిపాడు.
క్లైమాక్స్ లో రాంచరణ్ జగపతి బాబు కోసం వెతుకుతుంటారు. లాంచ్ లో వెళ్ళిపోతున్నాడనే అనుమానంతో కదులుతున్న లాంచ్ ని చేరుకోవడానికి నీటిలో ఈదుకుంటూ వెళ్తాడు. నీటిలో ఈదే సమయంలో లాంచ్ ఫ్యాన్ రెక్కలు చరణ్ కు చేరువగా వచ్చాయని, ఆ విషయాన్ని తాను మాత్రమే గమనించానని సుకుమార్ తెలిపాడు.
ఫ్యాన్ రెక్కలు చరణ్ ని సమీపిస్తున్న సమయంలో అసలేం జరుగుతోందని చాలా ఖంగారు పడ్డానని సుక్కు తెలిపాడు. చిరంజీవి గారు చరణ్ ని నా చేతుల్లో పెట్టారు. ఏం జరుగుతోంది అంటూ మనసులో ఆందోళన చెందానని తెలిపాడు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని, కనీసం చరణ్ కు కూడా ఈ విషయం తెలియదని సుక్కు అన్నారు.

Share This Video


Download

  
Report form