జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి జిక్సర్ బైకును యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ జోడింపుతో లాంచ్ చేసింది. సరికొత్త సుజుకి జిక్సర్ ఏబిఎస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 87,250 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
టూ వీలర్ల సేఫ్టీలో అత్యంత కీలమైన ఏబిఎస్ టెక్నాలజీని సుజుకి ఎట్టకేలకు తమ జిక్సర్ శ్రేణిలో పరిచయం చేసింది. జిక్సర్ బైకులోని ఫ్రంట్ వీల్‌కు సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ పరిచయం అయ్యింది.
ఏబిఎస్ ఫీచర్‌తో విడుదలైన జిక్సర్ శ్రేణి బైకులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. చూడటానికి అచ్చం స్టాండర్డ్ వేరియంట్‌నే పోలి ఉంటుంది. గతంలో, సింగల్ ఛానల్ ఏబిఎస్ జిక్సర్ ఫుల్లీ ఫెయిర్డ్ జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో ఆప్షనల్‌గా మాత్రమే లభించేది. ఇప్పుడు సుజుకి బెస్ట్ సెల్లింగ్ బైకు జిక్సర్‌లో తప్పనిసరిగా ఫీచర్‌గా లభ్యమవుతోంది.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/suzuki-gixxer-abs-launched-india-at-rs-87-250-specifications-features-images/articlecontent-pf76914-012108.html