భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో తమ కొత్త "హీరో మాస్ట్రో ఎడ్జ్ 110" బిఎస్6 మోడల్‌ను విడుదల చేసింది. బిఎస్6 మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.60,950.
హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ బిఎస్6కి అప్డేటెడ్ చేయబడిన ఇంజన్‌తో పాటుగా సరికొత్త ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ‘అల్లాయ్ వీల్ - ఎఫ్ఐ' ధర రూ. 62,450. ఈ రెండు వేరియంట్లలో కొద్దిపాటి కాస్మెటిక్ తేడాలు ఉన్నాయి.