Virat Kohli Is Not A Machine, He Is A Human: Ravi Shastri

Oneindia Telugu 2018-05-25

Views 108

With Indian skipper Virat Kohli getting ruled out of the county stint for Surrey due to a neck injury, coach Ravi Shastri once again iterated the need for reduction in the workload of Indian cricketers. Speaking to reporters, Shastri said that Kohli is a human, just like everyone else.
#bcci
#viratkohli
#teamindia
#ravishastri

మరి కొద్ది రోజుల్లో సర్రే తరపున కౌంటీ క్రికెట్‌లో ఆడాల్సి ఉన్న కోహ్లీ వెన్నెముక గాయం కారణంగా తప్పుకున్నాడు. అతనికి దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో తప్పని పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే కోహ్లీ కౌంటీల్లో ఆడతానంటే నిరాకరించిన వాళ్లతో పాటుగా, ఆడలేకపోతున్నందుకు అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలను టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఖండించారు.
విరాట్ కోహ్లి పరుగుల యంత్రం కాదు, అతను కూడా అందరిలాంటి మనిషే, అందరిలా విశ్రాంతి కావాలని టీమిండియా కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మెడ గాయం కారణంగా వెన్నెముకు విశ్రాంతి కావాలని సర్రే తరఫున కౌంటీ క్రికెట్‌కు కోహ్లి దూరమైయ్యాడని తెలిపాడు. వెనుక నుంచి రాకెట్ ఇందనాన్ని ఉంచి అతణ్ని మైదానంలోకి పంపలేం కదా.. అంటూ శాస్త్రి ఒకింత సహనంగా మాట్లాడాడు.
కోహ్లి టాప్ డాగ్ అంటూ ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. అతడు టాప్ డాగ్ కాదంటూ శాస్త్రి కామెంట్ చేశాడు. కోహ్లికి గాయం కావడం పట్ల సర్రే జట్టు యాజమాన్యం తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. విరాట్ కౌంటీల్లో ఆడితే చూడాలని అభిమానులు ఎంతో ఆశించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS