Team India West Indies Tour 2019:"Nothing permanent with a long term effect should happen at this stage of transition. Shastri and Kohli complement each other well and it would be unfair to change half of a team that has been successful," the official said.
#viratkohli
#teamindiawestindiestour2019
#ravishastri
#HeadCoach
#bcci
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం వరల్డ్ కప్‌తో ముగియడంతో.. ఆయన కాంట్రాక్టును 45 రోజులపాటు పొడిగించిన బీసీసీఐ కోచ్, ఇతర సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని కొనసాగించడం దాదాపు అసాధమ్యమే. కాగా, భారత క్రికెట్ కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించాలనే వాదన కూడా బీసీసీఐ పెద్దల్లో వినిపిస్తోంది. రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగిస్తే అది కోహ్లి కెప్టెన్సీలో మరిన్ని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కోచ్‌ను మారిస్తే మాత్రం భారత క్రికెట్ జట్టును డేంజర్ జోన్‌లో పడేస్తుందన్నారు.