Now, a source close to the development has revealed to us that Koratala Siva's first mega project may feature none other than Megastar Chiranjeevi. Koratala Siva has become one of the leading directors in Tollywood with back to back hits. Recently he bagged another success in his kitty with Mahesh Babu's Bharat Ane Nenu.
#Chiranjeevi
#KoratalaSiva
#Tollywood
#BharatAneNenu
భరత్ అనే నేను సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న ఈ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హీరో రామ్ చరణ్‌తోనే కొరటాల శివ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఒకప్పుడు ఓపెనింగ్ కూడా జరిగి ఈ కాంబినేషన్ ఆగిపోగా.. మళ్ళి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు జనాలు. సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు త్వరలో కొరటాల సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం మేరకు కొరటాల శివ ముందు పవన్ కళ్యాణ్ కు ఒక కథ చెప్పడం జరిగిందట. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ కథను అన్నయ్యతో చెయ్యమని పవన్ స్వయంగా కోరటాలకు చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్.
ఇటీవల 'భరత్ అనే నేను' సినిమాను తెగ ప్రశంసించాడు మెగాస్టార్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొరటాల శివ, చిరంజీవి సినిమా చేయ్యబోతున్నారని. చరణ్, బన్నీ వంటి యగ్ హీరోస్‌తో సినిమాలు చేస్తాడనుకున్న కొరటాల ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ్యబోతుండడం విశేషం. సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు త్వరలో కొరటాల సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.