"Saw #NaaPeruSuryaNaaIlluIndia at Overseas Censor Board !! A Well Made Film in all Respects. Simply MINDBLOWING ! alluarjun gave Top Notch Performance !! After #Rangasthalam, #BharatAneNenu another Telugu Blockbuster on the way." Umair Sandhu tweeted.
తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు రావడం, రంగస్థలం, భరత్ అనే నేను వరుసగా రూ. 200 కోట్ల వసూళ్లు సాధించడంపై పొరుగు సినీ ఇండస్ట్రీల్లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరబోతోంది అనే చర్చ సాగుతోంది. ఆ సినిమా మరేదో కాదు... అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ఆడియో, పోస్టర్లకు భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సెన్సార్ కాపీ చూసిన వారంతా ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' స్థాయిలో ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఎవర్సీస్ సెన్సార్ బోర్డులో చూసిన ఉమైర్ సంధు కూడా.... టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.
గతంలో ఏ సినిమాకు కష్టపడనంతగా అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. సినిమా కథతో పాటు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలవబోతోంది.డాన్సులు, ఫైట్స్ చేయడంలో బన్నీది ప్రత్చేక స్టైల్. ఈ చిత్రంలో బన్నీ చేసే విన్యాసాలు ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకోనున్నాయి
#NaaPeruSuryaNaaIlluIndia
#BharatAneNenu
#Rangasthalam