Allu Arjun Talks About His Movie Naa Peru Surya

Filmibeat Telugu 2018-04-23

Views 336

Allu Arjun's much awaited patriotic flick, 'Naa Peru Surya' will be released on May 4, say latest reports. The movie has received a U/A certificate from censor members. In naa peru surya audio event allu arjun reveal entire story of the film

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". అను ఇమ్యన్యుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 4న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిన్న ఈ సినిమా ఆడియో వేడుక మిలిటరీ మాధవరం అనే గ్రామంలో ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియో వేడుక‌లో అల్లు అర్జున్ క‌థ మొత్తం చెప్పాడు. వ‌క్కంతం వంశీ వ‌చ్చి క‌థ చెప్పిన‌పుడు తానేం విన‌లేద‌ని.. సింపుల్ గా ఒక్క లైన్ కు మాత్ర‌మే బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని గుర్తు చేసుకున్నాడు బన్ని. ఈ సినిమాలో హీరో లక్ష్యం దేశానికి సేవ చెయ్యడమే అని చెప్పాడు. ఆ పాయింట్ నచ్చి సినిమా ఒప్పుకున్నానని తెలిపాడు.
సైనికుడి క‌ష్టం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో తాను చూసాన‌ని. సినిమా ఆరంభం నుండి అంతం వరుకు దేశానికి మేలు చెయ్యాలని భావిస్తాడని తెలిపాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ సినిమా కథ ఉద్దేశం తెలిపాడు, హీరో పాత్రను పూర్తిగా వివరించడం జరిగింది. దీంతో సినిమా సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form