Celebrities Tweets On Rangasthalam

Filmibeat Telugu 2018-04-02

Views 2

Many celebs are impressed with Rangasthalam and they could not stop raving about Ram Charan, Samantha Akkineni, director Sukumar, other cast and crew for their wonderful work in the movie.

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
రంగస్థలం మూవీ బ్లడీ ‘ఎ' సినిమా అంటూ కామెంట్ చేసిన విజయ్.... సుకుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేశారు. నటన ‘ఎ', దర్శకత్వం ‘ఎ', కెమెరా పనితనం ‘ఎ', సంగీతం ‘ఎ', నిర్మాణ విలువలు ‘ఎ'.. చరణ్‌, సామ్, సుక్కు, మైత్రీ, డీఎస్పీ, రత్నవేలు‌.. సూపర్‌' అంటూ ట్వీట్‌ చేశారు.
‘రంగస్థలం' సినిమా ఎక్సలెంటుగా ఉందంటూ మెగా డాటర్ నిహారిక రివ్యూ పోస్టు చేశారు. సుకుమార్ డైరెక్షన్ టాప్ రేంజిలో ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతం, దేవిశ్రీ ప్రసాద్ రీరికార్డింగ్, మ్యూజిక్ అందరినీ కట్టపడేసింది. ఇక చిట్టిబాబుగా అన్నయ్య రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. కోపం, ప్రేమ, ఆనందం, బాధ, కామెడీ, ఇన్నోసెన్స్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లో అదరగొట్టారు. మా అన్నా మజాకా! టీం మొత్తానికి కంగ్రాట్స్... అని నిహారిక వ్యాఖ్యానించారు.
దర్శకుడు సుక్కు ‘రంగస్థలం' చిత్రాన్ని ఎంతో బ్రిలియంట్‌గా తెరకెక్కించారు. డీఎస్పీ మరోసారి మ్యూజిక్ మీద తన పాషన్ ఏమిటో చూపించాడు. రత్నవేలు ఎక్స్ పీరియన్స్, సమంత మ్యాజిక్, రామ్ చరణ్ వన్ మెన్ షో... ఓవరాల్ సినిమా సూపర్. అందరికీ కంగ్రాట్స్ అంటూ హీరో రామ్ ట్వీట్ చేశారు.
రంగస్థలం మూవీ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని మంచు లక్ష్మి అన్నారు. రామ్ చరణ్ అదరొట్టారు, సమంత స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, సుకుమార్ అద్భుతంగా తీశారు అని పొగడ్తల వర్షం కురిపించారు.
రంగస్థలం సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్, సుకుమార్ లకు హాట్సాఫ్ చెప్పారు హీరో నవదీప్. ప్రతి యాక్టర్ పెంటాస్టిక్‌గా చేశారని ప్రశంసించారు.

Share This Video


Download

  
Report form