Ball Tampering : Smith, Warner, Bancroft May Face Up To One Year Ban

Oneindia Telugu 2018-03-27

Views 53

According to The reports, Lehmann will resign from his role before the fourth Test against South Africa begins on Friday, one year ahead of his planned departure after the 2019 Ashes series

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న బాల్ టాంపరింగ్ వివాదంపై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ నిమిత్తం నియమితులైన క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌ కేప్‌టౌన్‌ చేరుకుని బాల్ టాంపరింగ్ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్‌లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను విచారిస్తున్నారు.
విచారణలో భాగంగా ఆసీస్ హెడ్ కోచ్‌ డారెన్‌ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విచారణ ప్రక్రియను బుధవారానికి పూర్తి చేయనున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సిఫారసు చేయనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం స్మిత్, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌, వార్నర్‌లను కనీసం ఏడాది పాటు సస్పెండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌ డారెన్‌ లీమన్‌ ను తక్షణమే పదవి నుంచి తప్పిస్తారని మంగళవారం ఆసీస్ మీడియా ప్రధాన కథనాలుగా ప్రచురించింది.
జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరం కలిసే టాంపరింగ్ ప్లాన్‌ను అమలు చేసినట్లు మీడియా సమావేశ అనంతరం చెప్పిన స్మిత్... ఇందులో కోచింగ్‌ స్టాఫ్‌ ప్రమేయం లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపే ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్‌ మాట్లాడుతూ 'కుట్రలో కోచ్‌ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్‌ తప్పుచేసినవాడే అవుతాడు' అని అన్నాడు. మరోవైపు శుక్రవారం ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందే లీమన్‌ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది.

Share This Video


Download

  
Report form