Ball Tampering: Did AUS Attempt Ball Tampering During Ashes Series?

Oneindia Telugu 2018-03-26

Views 119

After admitting to ball-tampering during the third Test against South Africa on Saturday, Smith had stated that ‘ this is the first time it has happened’; but video footage from the most recent Ashes series, that Australia won 4-0, may suggest otherwise.

కామెరూన్ బాన్‌క్రాఫ్ట్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న యువ క్రికెటర్. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ సూచన మేరకే బాల్ టాంపిరింగ్‌కు పాల్పడ్డానని మ్యాచ్ అనంతరం అంగీకరించాడు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఓ వీడియో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ని మరింత ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ జరిగింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 4-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా యాషెస్‌ సిరీస్‌లోనూ ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్ పాల్పడ్డాడనే అనుమానులు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఎవరైతే బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారో ఆ ఆటగాడే యాషెస్‌ సిరీస్‌లోనూ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న బాన్‌క్రాఫ్ట్ ఓ స్పూన్ షుగర్‌ను తీసుకొని తన ఎడమవైపు జేబులో వేసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. బంతి స్వరూపాన్ని మార్చేందుకు ఆటగాళ్లు అనేక పద్దతులను ఉపయోగిస్తుంటారు. కొందరు ఆటగాళ్లు బంతిని గరుకుగా మార్చేందుకు గాను జెల్‌లాంటి పదార్థం పూసి బంతి మెరుపును పెంచే ప్రయత్నం చేస్తారు.
మరికొందరు తాము ధరించిన దుస్తులకు బంతిని అదే పనిగా రుద్ది బంతిని గురుకుగా చేస్తుంటారు. తాజా వీడియోని చూస్తే యాషెస్ సిరి‌స్‌లో బాన్‌క్రాఫ్ట్ చక్కెరను ఉపయోగించి బంతి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశాడేమో అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను ద సన్ రిపోర్టర్ డేవిడ్ కవర్‌డేల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Share This Video


Download

  
Report form