Convicted AIADMK leader VK Sasikala, who is currently lodged in Bengaluru's Parappanna Agrahara Jail, was granted a 15-day parole to attend her husband Natarajan last rites.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే శశికళ తన భర్త చనిపోయాడని, అంత్యక్రియలకు హాజరుకావడానికి పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు పెరోల్ మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాదులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
గ్లోబల్ ఆసుపత్రి నుంచి నటరాజన్ మృతదేహాన్ని చెన్నైలోని బిసెంట్ నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ నటరాజన్ కు నివాళులు అర్పించారు. ప్రజలు సందర్శనం కోసం బిసెంట్ నగర్ లో మంగళవారం సాయంత్రం వరకు నటరాజన్ మృతదేహాన్ని పెడుతున్నామని శశికళ బంధువులు చెప్పారు.
నటరాజన్ మరణించడంతో టీటీవీ దినకరన్ మద్దతుదారులు మాత్రమే ఆయనకు నివాళులు అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు అన్నాడీఎంకే పార్టీ నేతలు ఒక్కరు కూడా నటరాజన్ కు నివాళులు అర్పించడానికి వెళ్లలేదు.