Shankaracharya Jayendra Saraswathi Last rites ceremony, Video

Oneindia Telugu 2018-03-01

Views 925

The final rituals for Shankaracharya Jayendra Saraswathi begins and it's called 'Brindhavana Pravesam,' began with an 'abishekam' or bath.

అనారోగ్యంతో మరణించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కాసేపట్లో మహాసమాధి కానున్నారు. జయేంద్ర సరస్వతి పార్థివదేహానికి వేదపండితులు మహాభిషేకం నిర్వహిస్తున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేయనున్నారు. స్వామిని కడసారి దర్శనం కోసం భారీగా భక్తులు మఠానికి తరలివస్తున్నారు. కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కన్నమూశారు.. రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే వెంటనే అస్వస్థతకు గురయ్యారు. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు. సేవకులు స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్‌కు తరలించారు.
వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జయేంద్ర సరస్వతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.గురువారం ఉదయం నుండి జయేంద్ర సరస్వతి మహసమాధి కోసం ఏర్పాట్లు చేశారు.

Share This Video


Download

  
Report form