India decimated Sri Lanka in the fourth T20 of the Nidahas Trophy 2018. Karthik finds boundary and then takes an easy single.India wins this match by 6 wickets and they are in race to reach the final
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తద్వారా లంకేయులతో ఆరంభంలో ఎదురైన ఓటమి బదులు తీర్చుకుంది.
తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో పాటు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (11), శిఖర్ ధావన్ (8), కేఎల్ రాహుల్ (18), సురేశ్ రైనా (27) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండే (41), కార్తీక్ (29) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
లంక బౌలర్లలో దనంజయ రెండు వికెట్లు తీసుకోగా, ప్రదీప్, జీవన్ మెండిస్ తలో వికెట్ తీసుకున్నారు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తొలత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 153 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఓపెనర్ మెండీస్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా... తరంగ (22), శనక (19) గుణరత్న(17) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసుకోగా, సుందర్ రెండు, చాహల్, విజయ్, ఉనద్కట్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.