BCCI on Wednesday announced the new pay structure for the Indian men's cricket team with all the players being divided into four categories but Mohammed Shami's name is missing from any of the graded contracts list.
తన భర్త మహమ్మద్ షమీకి చాలా మంది అమ్మాయితో వివాహేతర సంబంధాలున్నాయంటూ షమీ భార్య హసిన్ జహాన్ ఆరోపిస్తూ కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేపథ్యంలో షమీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.
షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం వేధిస్తోందని ఆమె ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయింది. తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. హసిన్ జహాన్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది.