Actresses Who Left Us Too Soon

Filmibeat Telugu 2018-02-26

Views 6

Indian cinema is currently mourning the sudden news of actor Sridevi who was aged 54. Like Sridevi, Savitri and Soundarya in South Indian cinema too passed away at an age which left their fans shocked.

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో శ్రీదేవి చెరగని ముద్ర వేశారు. అందుకే శ్రీదేవి మరణం దక్షిణాదిన భారీ విషాదంలా మారింది. గతంలో దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ తరహాలో కుదిపేసిన విషాదాలు ఇద్దరు స్టార్ హీరోయిన్ల మరణం సమయంలో చోటు చేసుకున్నాయి.
శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే మరణించారు. ఆమె మరణాన్ని సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో దక్షిణాది స్టార్ హీరోయిన్లు సావిత్రి, సౌందర్య కూడా శ్రీదేవి తరహాలోనే అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తి వెళ్లిపోయారు.
ప్రముఖ నటి, దక్షిణాది స్టార్ హీరోయిన్ సావిత్రి 47 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఇక సౌత్‌లో తిరుగులేని హీరోయిన్‌గా తన సత్తా చాటిన సౌందర్య కేవలం 34 ఏళ్ల వయసులోనే ఓ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. జెమిని గణేశన్‌తో వివాహం తర్వాత సావిత్రి జీవితం ఊహించని మలుపు తిరిగింది. కారణం ఏమిటో తెలియదుకానీ తాగుడుకు బానిసయ్యారు. చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానకి గురై ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోయి మరణించారు. తెలుగు సినీ రంగంలో రారాణి గా వెలుగొంది ఆమె అలా మరణించడం అభిమానులను కలిచి వేసింది.
సౌత్‌ స్టార్ హీరోయన్‌గా వెలుగొందుతున్న రోజుల్లో సౌందర్య ఓ ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 1992లో గాంధర్వ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సౌందర్య అతి తక్కువ కాలంలోనే తన అందం, నటనతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ హీరోలతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. సౌందర్య మరణం కూడా అప్పట్లో సౌత్ చిత్ర పరిశ్రమలో భారీ విషాదంగా మిగిలిపోయింది.


Share This Video


Download

  
Report form