Harish Shankar Aggressive Speech On Media Abusing Actresses

Filmibeat Telugu 2018-03-28

Views 392

Director Harish Shankar Aggressive Speech On Abusing Actresses. Movie Artist Association (MAA) Chalana Chitra Nirasana Press Meet held at Hyderabad.


ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో టీవీ ప్రజంటర్ ఇండస్ట్రీ నటీమణులను ఉద్దేశించి తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కదిలింది. ఇప్పటికే సదరు యాంకర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన 'మా' సభ్యులు, మంగళవారం నిరసన తెలుపుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...
మా గురించి ఒకరు తప్పుగా మాట్లాడితే దానిపై చర్చించడానికి మేమ అంతా కలవడం ఎంత గర్వంగా ఉందో ఇలాంటి మీటింగ్ ఒకటి కండక్ట్ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గు పడుతున్నానం. ఇలాంటి మీటింగులు పెట్టే పరిస్థితి ఇకపై రావొద్దు అని కోరుకుంటున్నాను అని హరీష్ శంకర్ అన్నారు.
ఈ రోజు మీటింగ్ జరుగుతుందని తెలిసినపుడు కొందరు నాకు ఫోన్ చేశారు. బయ్యా నీకు అవసరమా? నువ్వెందుకు వెళుతున్నావ్, అదేదో లేడీస్ ఇష్యూ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అపుడు నేను ఒకటే అన్నాను. నన్ను తిట్టే వరకు కూడా నేను వెయిట్ చేయాలా? అని అనడిగాను, దానికి అవతలి వ్యక్తి....అసలు మీరు ఎంత మంది వస్తారో చూస్తాం, మీ ప్రోగ్రాం ఎలా కవరేజ్ అవుతుందో చూస్తాం...అంటూ బెదిరించారని హరీష్ శంకర్ తెలిపారు.
మేము చేస్తున్న నిరసనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా సినిమా పంక్షన్లకు కూడా నేను ఇలా మాట్లాడలేదు. మేము ఈ స్థాయిలో ఆందోళన చేస్తూ ముందుకు రావడానికి కారణం కేవలం సదరు ఛానల్ ప్రతినిధి మాట్లాడిన బాషే. మీడియా మీద కానీ, ఆ ఛానల్స్ మీద మాకు ఎలాంటి కోపం లేదు. అలా మాట్లాడినందుకు సారీ చెప్పినట్లు కొందరు చెబుతున్నారు. క్షమాపణలు కోరుతూ స్క్రోలింగ్ వేశారట. ఇది మైకులో తిట్టి చెవిలో సారీ చెప్పినట్లు ఉంది అంటూ హరీష్ శంకర్ మండి పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS