Anil Ravipudi To Direct Balakrishna

Filmibeat Telugu 2018-02-24

Views 681

Anil Ravipudi will going to direct Balakrishna. C Kalyan trying to produce this project.

బాలకృష్ణ 2018 సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించారు. బాలయ్య నటించిన జై సింహ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కాగా బాలకృష్ణ తదుపరి చిత్రంపై ఆసక్తికర ప్రచారాలు మొదలయ్యాయ. ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటిస్తున్న బాలయ్య కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు.
జై సింహా చిత్రం విజయం సాధించడంతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు. హుషారుగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు.
బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం ఆవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఎందుకంటె తేజ వెంకటేష్ తో కూడా ఓ చిత్రానికి కమిటై ఉండడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ 2019 ఎన్నికల ముందు విడుదల చేయడమే టార్గెట్. దానికి ఇంకా టైం ఉండడంతోనే ఈ ఆలస్యం జరుగుతోందనేది కొందరి వాదన.
ఈ గ్యాప్ లో బాలయ్యతో ఓ సినిమా చేయాలని జై సింహా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది
సి కళ్యాణ్ బాలయ్యతో సినిమా కోసం దర్శకుడు వివి వినాయక్ ని సంప్రదించారట. కానీ తనకున్న ఇతర కమిట్మెంట్స్ వలన చేయలేనని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form