An under-construction building collapsed at Kasavanahalli's Sarjapur road on Thursday. Many people are feared to be trapped under the debris after the building
నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. బెంగళూరు లోని సర్జాపుర రోడ్ లోని కసువన హళ్లి లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం తో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాలామందికి గాయాలు అయ్యాయి. బిల్డింగ్ పెద్ద శబ్దంతో కూలిపోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రస్తుతం భవనంలో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. భవనం కూలిన సమయంలో అందులో 20 మంది వర్కర్స్ వరకు ఉనట్టు తెలిసింది. వాళ్ళంతా శిధిలాల కిందే చిక్కుకుపోయారు. ఎంతమంది గాయాలతో బయటపడతారో, ఎంతమంది సజీవంగా ఉంటారో అనేది తెలియట్లేదు. రేస్క్యు టీం వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. కాగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.